కరోనా.. రెస్పిరేటరీ వైరస్ అని.. అది శ్వాసకోస వ్యవస్థపైనే ప్రధానంగా ప్రభావం చూపుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అయితే, సార్స్ కొవ్-2 వైరస్ ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు సహా శరీరమంతా వ్యాప్తి చెందుతుందని.. వైరస్ ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత దాదాపు 8 నెలలు దేహంలో ఉంటుందని పరిశోధనలో తేలింది. రోగుల్లో లక్షణాలు మొదలైన తొలి 2 వారాల్లోనే వివిధ శరీర భాగాల్లో వైరస్ ఆనవాళ్లు కనుగొన్నామనే శాస్త్రవేత్తల అధ్యయనం నేచర్ జర్నల్ లో ప్రచురితమైంది.