అమెరికా టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టు జడ్జిగా ప్రవాస భారతీయురాలు జూలీ మాథ్యూ వరుసగా రెండోసారి ఎన్నికై చరిత్ర సృష్టించారు. తన ప్రత్యర్థి రిపబ్లికన్ అభ్యర్థి ఆండ్రూపైన విజయం సాధించారు. జూలీది కేరళలోని వెన్నికులం గ్రామం. తల్లిదండ్రులతో కలిసి చిన్నప్పుడే అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఈసారి ఆమె కేరళలోని పతినంతిట్ట జిల్లాలోని తిరువల్ల గ్రామంలో తన మెట్టినింటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిగా ప్రమాణం చేశారు.