గిడ్డంగుల నిర్వహణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, సైనికులకు ఉపయోగకరంగా ఐఐటీ గువాహటిలోని ఏరోమోడలింగ్ క్లబ్ విద్యార్థులు పలు అధునాతన డ్రోన్లను అభివృద్ధి చేశారు. గిడ్డంగుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా వేర్ హౌజ్ డ్రోన్లను తయారు చేశారు. ఇవి మనుషులకు కష్టమైన పనులు చేస్తాయి. వీటికి మరింత సాంకేతికత జోడించి భవిష్యత్తులో వస్తువులు డెలివరీ చేసేలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సైనిక, శాంతి భద్రతల పర్యవేక్షణ అవసరాలకు రీపర్ డ్రోన్లను రూపొందించారు.