PhD, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్ సెట్ లో సీట్ల కేటాయింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. PhD కోర్సుల్లోని మొత్తం సీట్లలో 50 శాతం ఏ-కేటగిరీలో, 50 శాతం బీ- కేటగిరీలో కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీవో జారీ చేసింది. కాగా, గత ఏడాది నుండి అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఏపీఆర్ సెట్ ను నిర్వహించి, అందులో అర్హత సాధించిన వారికే సీట్లు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.