మహారాష్ట్రలో విద్యుత్ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 ప్రభుత్వ విద్యుత్ సంస్థల ఉద్యోగులు నేటి నుంచి 72 గంటల నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 30కి పైగా సంఘాలు ఒక్కటై సమ్మెకు పూనుకున్నాయని మహారాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫెడరేషన్ కార్యదర్శి కృషన్ భోయిర్ తెలిపారు. దాదాపు 86 వేల మంది ఉద్యోగులు, అధికారులు, ఇంజినీర్లతో పాటు 42 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ సంస్థల్లో పని చేస్తున్నారు.