18 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన యూపీలోని పిలిభిత్ జిల్లాలో జరిగింది. జనవరి 1న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కమల్ అనే వ్యక్తి యువతిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టి విషం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రశ్నించేందుకు వెళ్లిన యువతి కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడినట్లు చెప్పారు. బాధితురాలు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.