భోజనానికి ఓ 20 నిమిషాల ముందు సూప్ తాగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి జీర్ణాశయ గోడలను, కండరాలను సిద్ధం చేసి బాగా ఆకలి కలిగేలా చేస్తాయి. పాలక్ సూప్, టమాట సూప్, పుదీనా సూప్ ఇంకా కొత్తిమీర సూప్ వంటివి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇంట్లోనే తయారు చేసుకొని తాగడం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు పొందొచ్చని పేర్కొంటున్నారు.