మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ బహిష్కృత నేత మిశ్రీ చంద్రగుప్తాకు చెందిన ఐదంతస్తుల హోటల్ ను అధికారులు మంగళవారం కూల్చేశారు. ఇండోర్ నుంచి పేలుడు పదార్థాల బృందాన్ని రప్పించి సుమారు 12 గంటలు శ్రమించి 5 సెకన్లలో భవనాన్ని కూల్చేశారు. ఈ భవనానికి రెండంతస్తుల వరకే అనుమతి ఉంది. కానీ ఐదంతస్తులు నిర్మించడంతో చర్యలు చేపట్టారు. గత నెల 23న మిశ్రీచంద్రగుప్తా సోదరుడు, మేనల్లుడు ఓ యువకుడిని హత్య చేశారనే ఆరోపణలతో ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించింది.