సోషల్ మీడియా దిగ్గజం ‘ట్విట్టర్’ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో అనుమతించబడిన రాజకీయ ప్రకటనల రకాలను విస్తరింపజేస్తామని ట్విట్టర్ మంగళవారం తెలిపింది. యూఎస్ లో ‘కాజ్ బేస్డ్ యాడ్స్’ కోసం తమ ప్రకటనల విధానాన్ని కూడా సడలించనున్నట్లు పేర్కొంది. తమ ప్రకటనల విధానాన్ని టీవీ, ఇతర మీడియా అవుట్ లెట్ ల ద్వారా ప్రచారం చేయనుంది. కాగా, 2019లో ట్విట్టర్ రాజకీయ ప్రకటనలను నిషేధించింది.