నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2000 నుండి 2750 వరకు పెంచడం జరిగిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప మోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. గోస్పాడు మండలంలో దాదాపు 5600 పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మార్క్ఫెడ్ చైర్మన్ పి పీ నాగిరెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ పిపి మధుసూదన్ రెడ్డి, సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.