నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలో ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆరవ తరగతిలో చేరాలనుకునే విద్యార్థి ఐదో తరగతిని స్థానిక జిల్లాలోనే చదివి ఉండాలి. దీంతో పాటు విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల శాశ్వత చిరునామా సైతం అదే జిల్లాలో ఉండాలి. అంతేకాకుండా విద్యార్థి వయస్సు గ్యాప్ కూడా గతంతో పోలిస్తే రెండు సంవత్సరాలు తగ్గించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.