పెళ్లాం పుస్తెల తాడులు సైతం తాకట్టు పెట్టి కాలువలు, రోడ్లు, బోర్లు వేశామని, సకాలంలో బిల్లులు ఇవ్వ రా అని పలాస-కాశీబుగ్గకు చెందిన కాంట్రాక్టర్ కణితి దామోదర్ మునిసిపల్ కమిషనర్ టి.రాజగోపాలరావును నిల దీశారు. పనులు చేయించుకుని బిల్లుల్విడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మునిసిపల్ కార్యాలయంలో చైర్మన్ బళ్ల గిరిబాబు చాంబర్ వద్ద మంగళ వారం ఈ సంఘటన జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa