చిత్తూరు జిల్లా, పెనుమూరు మండలం, పరిధిలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు యువకుడు బలి అయ్యాడు. పెనుమూరు మండలం ఏపీ కాలనీకి చెందిన జానకిరామ్(25) సూసైడ్ నోట్ రాసి ఇంటిలోనే ఉరి వేసుకున్నాడు. లోన్ యాప్‌లో జానకీరామ్ 80 వేల రూపాయలు అప్పు చేసి తిరిగి కట్టలేక వారి బ్లాక్ మెయిల్‌కు భయపడి బలవన్మరణాన్ని ఆశ్రయించాడు. నెల రోజులుగా అయ్యప్ప మాలధారణలో ఉన్న జానకీరామ్ ఈరోజు సాయంత్రం మాల తీసి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.