బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సిక్కోలు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కొత్త అధ్యక్షునిగా బిర్లంగి ఉమామహేశ్వరరావును ఆయన నియమించండంతో రచ్చ ప్రారంభమైంది. వీర్రాజు నిర్ణయంపై సిక్కోలు నేతలు మండిపడుతున్నారు. యేడాది క్రితం పార్టీలో చేరిన వ్యక్తిని ఎలా నియమిస్తారంటూ అసమ్మతి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశం నిర్వహించి వీర్రాజు నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్నారు. జిల్లా నేతలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంపై పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు.