జగన్ సర్కారు చర్య దుర్మార్గమైనదని ఏపీ పౌరహక్కుల సంఘం(ఏపీసీఎల్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేసేలా జారీ చేసిన జీఓ1 ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హక్కుల పరిరక్షణకోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.