వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. బుధవారం సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ని మన్నారు పోలూరు లో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.