పంజాబ్ లోని మోగాకు చెందిన కబడ్డీ కోచ్ గురుప్రీత్ సింగ్ (43) గురుప్రీత్ సింగ్ మనీలాలో దారుణ హత్యకు గురయ్యాడు. గురుప్రీత్.. నాలుగేళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లి అక్కడే ఉంటున్నాడు. అతను ఇంట్లో ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించిన కొందరు దుండగులు అతడిపై కాల్పులు జరిపి, హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురుప్రీత్ స్వగ్రామమైన పఖర్వాడ్ లో విషాదం నెలకొంది. గ్రామస్థులు అతని మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పంజాబ్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.