కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘అగ్నివీర్’ ప్రక్రియను రద్దు చేయనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. భారత్ జోడో యాత్ర యూపీలోని బాగ్ పట్ లో కొనసాగుతుండగా.. సిసానా సమీపంలో అగ్నివీర్ ప్రక్రియకు సంబంధించి యువకులు రాహుల్ ను కలిసి వివరించారు. దీనిపై స్పందించిన రాహుల్ అధికారంలోకి వస్తే పాత విధానాన్నే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. ‘అగ్నివీర్’ కారణంగా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్న ఎందరో యువత నిరుత్సాహానికి గురయ్యారన్నారు.