తొలి టీ20 లో ఉత్కంఠ భరిత విజయంతో ఈ ఏడాదిని ప్రారంభించిన టీమిండియా, నేడు శ్రీలంకతో రెండో టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించి, సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. నేడు పూణే వేదికగా రాత్రి 7 గంటలకు రెండో టీ20 ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కి గాయం కారణంగా సంజూ శాంసన్ దూరం అవ్వగా, అతని స్థానంలో రుతురాజ్, రాహుల్ త్రిపాఠిల్లో ఒకరికి అవకాశం రావొచ్చు. అయితే, తృటిలో తొలి టీ20ని చేజార్చుకున్న శ్రీలంక, ఈ మ్యాచ్ లో గెలిచి సరీస్ ను సమం చేయాలని భావిస్తోంది.