ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం ఆటంకం కలిగిస్తుందని ఆరోపించారు. 'ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను పోలీసుల సహాయంతో వేధిస్తుంది. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ప్రతిపక్ష నేతను ఆయన నియోజకవర్గంలో పర్యటించనీయకపోవడం దురదృష్టకరం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి' అని రాష్ట్రపతికి లేఖ రాశారు.