సామాజిక కార్యకర్త ప్రదీప్ పటేల్, అతడి స్నేహితుడు భరత్ పటేల్ ఇద్దరు గుజరాతీ గిరిజనులు యాంటీ క్లాక్ వైజ్ వాచ్ తయారు చేశారు. కొన్ని నెలలు పరిశోధన చేసిన తర్వాత గత డిసెంబర్ లో ఈ వాచ్ తయారు చేశారు. గిరిజనుడి ఫోటో, ‘జై ఆదివాసీ’ క్యాప్షన్ తో తయారు చేసిన వీటికి ‘ఆదివాసీ ఘడీ (ట్రైబల్ వాచ్)’ అని పేరు పెట్టారు. ఈ చేతి గడియారాలను ఈ నెల 13 నుంచి 15 వరకూ గుజరాత్ లో జరిగే ఆదివాసీ ఏక్తా పరిషద్ లో ప్రదర్శన, అమ్మకానికి ఉంచనున్నారు.