యూపీలోని రామ్ పూర్ ప్రత్యేక కోర్టుకు సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రద హాజరయ్యారు. 2019 నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె కోర్టు ఎదుట గత మూడున్నరేళ్లుగా హాజరు కాకపోవడంతో గత నెలలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. బుధవారం ఆమె కోర్టులో హాజరు కావడంతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. అధికారుల అనుమతి లేకుండా జయప్రద అప్పటి ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో 2 వేర్వేరు పోలీస్ స్టేషన్లలో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.