పశ్చిమ బెంగాల్ లో కరోనా నూతన వేరియంట్ కలకలం రేపింది. అమెరికా నుండి వచ్చిన నలుగురికి బీఎఫ్.7 కరోనా వేరియంట్ నిర్ధారణ అయింది. ఈ నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. డిసెంబర్ 29న వీరికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో శాంపిల్స్ ను జీనోమ్స్ సీక్వెన్స్ కు పంపగా, బీఎఫ్.7 వేరియంట్ గా నిర్ధారణ అయింది. అధికారులు వీరిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉంచారు.