జమ్ముకశ్మీర్ లో వరుసగా పౌర హత్యలు, ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 20 కంపెనీల పారా మిలిటరీ బలగాలు అదనంగా 2 వేల మంది సైనికులతో పంపిస్తున్నట్లు సీఆర్ పీఎఫ్ ప్రకటించింది. ఈ సిబ్బందిని రాజౌరీ, పూంచ్ జిల్లాలో మోహరించనున్నట్లు పేర్కొంది. జమ్ములో భారీ ఉగ్రదాడి జరగనుందనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో ఉగ్రదాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు.