ప్రభుత్వ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ సంఘాలు 72 గంటలు సమ్మెకు దిగడంతో మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. సంస్థలను ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చింది. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం విద్యుత్ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ప్రభుత్వం, సంఘాల మధ్య సమాచార లోపం వల్లే వివాదం తలెత్తిందని ఫడ్నవీస్ తెలిపారు.