ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించింది. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్దార్థరెడ్డిని నియమించింది. అలాగే బీసీ సెల్ కు జంగా కృష్ణ మూర్తి, చేసేత సెల్ కు గంజి చిరంజీవి, మహిళా విభాగానికి పోతుల సునీత, రైతు విభాగానికి ఎంవీఎస్ నాగిరెడ్డి, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్య, ఎస్టీ సెల్ కు మత్సవస వెంకటలక్ష్మీ, హునుమంత్ నాయక్, ఎస్సీ సెల్ కు జూపూడి ప్రభాకర్, నందిగం సురేశ్, అరుణ్, పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా సజ్జల భార్గవరెడ్డిని నియమించింది.