టీమిండియా స్టార్ బ్యాటర్ ఏమాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడిపేందుకు ఆసక్తి చూపిస్తాడు. తాజాగా యూపీలోని ఫరూకాబాద్ జిల్లాలో కోహ్లీ, అనుష్క దంపతులు పర్యటించారు. జిల్లాలోని బాబా నీమ్ కరోలీ బృందావన్ ఆశ్రమాన్ని కోహ్లి, అనుష్క సందర్శించారు. ఆశ్రమంలో ఉన్నవారికి కోహ్లీ దంపతులు దుప్పట్లు పంపిణీ చేశారు. దాదాపు గంటపాటు ఆశ్రమంలోనే ఉండి ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడునన్న వారితో ముచ్చటించి అభిమానులతో ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.