మైనర్ విద్యార్థుల అసభ్య వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాడాకు చెందిన మదర్సా ఉపాధ్యాయుడిని బీహార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలికను అసభ్యకర వీడియోలు చేస్తూ బ్లాక్ మెయిల్ చేసేవాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్ పై పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.