ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటి ఘటనలు జరగకూడదని ఆ జీవో తెచ్చాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 05:26 PM

కందుకూరు, గుంటూరు తరహా సంఘటనలు మళ్లీ జరగకూడదన్న ఉద్దేశంతోనే జీవో నెం.01 తీసుకువచ్చినట్టు మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. అంతేతప్ప, చంద్రబాబును అడ్డుకోవడం కోసమే ఈ జీవో తెచ్చామనడం తప్పు అని అన్నారు. ఈ జీవో వైసీపీ సహా అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. ఈ జీవో తీసుకువచ్చాక సీఎం జగన్ రోడ్ షోలు చేయలేదని వెల్లడించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ సిద్ధంగానే ఉందని, ప్రత్యర్థి రాజకీయ పక్షాలన్నీ జగన్ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇక, టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రను తాము అడ్డుకోబోమని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com