ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు... ఏపీ కోస్తా జిల్లాల్లో కోడిపందాల జోరు మొదలవుతుంది. ముఖ్యంగా, ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో నిర్వహించే కోడిపందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి! కోడిపందాలను ప్రభుత్వాలు ఎప్పుడూ అనుమతించకపోయినా, సంక్రాంతి పండుగ రోజుల్లో ఎక్కడో ఒక చోట పందాలు నిర్వహిస్తుంటారు.
ఈ నేపథ్యంలో, సంక్రాంతి సందర్భగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ పేర్కొన్నారు. కోడిపందాలకు వేదికలు సిద్ధంచేసేవారు, కోడిపందాలకు స్థలాలు ఇచ్చేవారు, కోడికత్తుల తయారీదారులు, పేకాట నిర్వహణదారులను గుర్తించామని, గత 15 రోజుల వ్యవధిలో 1,361 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని ఎస్పీ వివరించారు. పందాల పేరుతో జంతువులను, కోళ్లను హింసించడం నేరమని, ప్రజలు సహకరించాలని కోరారు.