ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గట్టిగా సంకల్పించుకొని... అమలు చేస్తున్నది ఎక్కడ

national |  Suryaa Desk  | Published : Thu, Jan 05, 2023, 06:25 PM

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. 60 సెకండ్లు గడిస్తే నిమిషం. 60 నిమిషాలు గడిస్తే గంట. 24 గంటలు గడిస్తే రోజు. 365 రోజులు గడిస్తే ఏడాది. ఇలా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. మార్పు కోసం, మంచి కోసం, సానుకూల ఫలితాలను సాధించేందుకు కొత్త ఏడాదే కానక్కర్లేదు. జనవరి 1 వరకు వేచి చూడక్కర్లేదు. కానీ, కొంత మంది కొత్త సంవత్సరం సందర్భంగా తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. పోనీ అనుకున్నవి ఆచరిస్తారా? అంటే సందేహమే.


నేను ఇక నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, అనవసర ఖర్చులు చేయకూడదు, కొత్త సంవత్సరంలో ప్రతి రోజూ అరగంట వ్యాయామం చేయాలి, నిత్యం యోగా చేయాలి.. ఇలాంటివే కొన్ని తీర్మానాలు. కానీ, అనుకున్నవి ఆచరణలో పెట్టే వారు తక్కువే. కొందరు అనుకున్నవి మొదలు పెట్టి మధ్యలో వాటిని ముగించేస్తుంటారు. న్యూ ఇయర్ రిజల్యూషన్ కు సంబంధించి ఆలోచింపజేసే ఓఫన్నీ ట్వీట్ ను ఆనంద్ మహీంద్రా తన ఫాలోవర్ల కోసం తెచ్చారు. దీనికి యూజర్లు సైతం పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. శుక్రవారం ఈ పోస్ట్ పెట్టగా, ఇప్పటికే 11 లక్షల మంది చూసేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com