వెలగపూడి సచివాలయం నుంచి గురువారం స్పందన, రెవెన్యూ, రీసర్వే, అగ్రికల్చర్, హార్టికల్చర్, హౌసింగ్, గ్రామ/ వార్డు సచివాలయాలు, వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ డా. జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ డా. జవహర్ రెడ్డి మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ఉగాది నాటికి కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా ఐదు లక్షలు ఇళ్లు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పూర్తిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్టేజ్ కన్వర్షన్ మీద ఫొటోస్ పెట్టాలని సూచించారు. రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా వంద శాతం పూర్తిచేయాలన్నారు. పీఎం కిసాన్ పథకం అర్హులైన రైతులకు వర్తించేందుకు వీలుగా రైతుల నుంచి ఈకేవైసీ తప్పకుండా చేయించాలన్నారు. మైక్రో ఇరిగేషన్ లో భాగంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అర్హుల ఎంపిక, పరికరాల అమరికపై పూర్తి లక్ష్యం పెట్టుకోవాలన్నారు. మెరుగైన ఆరోగ్యాన్ని ప్రజలకు అందించేందుకు ఆక్వా హబ్‌లు జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద జీవనోపాధి కోసం స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు ఇప్పించాలన్నారు. ఆయా జిల్లాలలో జాతీయ రహదారుల పనులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరైన పనులు పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ ఉండాలన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చీఫ్ సెక్రటరీ జిల్లాల కలెక్టర్ లు, జెసిలు, జిల్లా అధికారులకు దిశ నిర్దేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి రామకృష్ణ, డిఈఓ మీనాక్షి, పంచాయతీ రాజ్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిఎంహెచ్ఓ కృష్ణారెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, అగ్రికల్చర్ జిల్లా అధికారి సుబ్బారావు, హార్టికల్చర్ జిల్లా అధికారి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.