AP: విజయవాడలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక స్థితి సరిగా లేని ఇద్దరు బాలికలను టార్గెట్‌గా చేసుకున్న త్రినాథ్ అనే యువకుడు, తినుబండారాల ఆశ చూపించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికల ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు విచారించగా విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa