ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్తంగా ఈద్ సంబరాలు ప్రారంభం

national |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2026, 11:04 AM

దేశవ్యాప్తంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సంబరాలు ప్రారంభమయ్యాయి. ముస్లింలు యుద్ధాలు త్వరగా ముగియాలని, శాంతి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఢిల్లీలోని జామా మసీదులో వేలాదిమంది ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈద్ సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సపల్ స్టేడియం, హైదరాబాద్‌లోని మక్కా మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక నమాజులు నిర్వహించారు.కేరళలోని పలు తీరప్రాంతాల్లో గురువారం సాయంత్రమే నెలవంక దర్శనమివ్వడంతో, అక్కడి మత పెద్దలు శుక్రవారమే ఈద్ జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అయితే ఢిల్లీతో సహా దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో గురువారం చంద్ర దర్శనం కాకపోవడంతో, ముస్లింలు శుక్రవారం నాడు రంజాన్ మాసపు చివరి ఉపవాసాన్ని పూర్తి చేసి శనివారం నాడు పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa