ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరగడంతో ప్లాస్టిక్ తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో బిస్లరీతో సహా పలు కంపెనీలు ధరలను 8 నుంచి 11 శాతం వరకు పెంచాయి. పాలిమర్, మూతలు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు పెరగడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఉదాహరణకు 1 లీటర్ ఉన్న 12 బాటిళ్ల ప్యాక్ ధర రూ.216 నుంచి రూ.240కు చేరింది. యుద్ధ పరిస్థితులు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa