ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఆధార్ కార్డుతో పాన్ కార్డు పొందడం సులభంగా ఉన్నప్పటికీ, మార్చి 31 తర్వాత దరఖాస్తు చేసుకునేవారు ఆధార్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అదనపు గుర్తింపు ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ-పాన్ డౌన్లోడ్ పేరుతో జరుగుతున్న మోసాలపై పోలీసులు అప్రమత్తం చేశారు. స్పామ్ లింక్‌లను క్లిక్ చేయవద్దని, ఐటీ డిపార్ట్మెంట్ అలాంటి సందేశాలు పంపదని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa