స్పెషల్ సమ్మర్ రివిజన్లో భాగంగా తుది ఓటర్ల జాబితా -2023ని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ విడుదల చేశారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తుది ఓటర్ల జాబితా -2023ని జిల్లా కలెక్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుది ఓటర్ల జాబితా -2023ని విడుదల చేసేందుకు కృషిచేసిన అధికారులందరినీ అభినందించారు. జిల్లాలో ఇంకా ఎవరైనా 18 సంవత్సరాలు నిండినవారు ఉంటే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకోవచున్నారు. www. ceoandhra. nic. in లేదా nvsp పోర్టల్ ద్వారా అర్హులైన వారు ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 13, 43, 312 మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. జిల్లాలో 6, 73, 955 మంది పురుష ఓటర్లు, 6, 69, 294 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 63 మంది ఉన్నారు. ఇందులో నూతనంగా 7, 134 మంది ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 3, 395 మంది పురుష ఓటర్లు, 3, 739 మంది మహిళా ఓటర్లు నూతనంగా పేర్లను నమోదు చేసుకున్నారు.
జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో 1, 05, 099 మంది పురుష ఓటర్లు, 1, 02, 334 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. హిందూపురం నియోజకవర్గంలో 1, 17, 957 మంది పురుష ఓటర్లు, 1, 15, 407 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 18 మంది ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో 1, 12, 977 మంది పురుష ఓటర్లు, 1, 10, 549 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 3 మంది ఉన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 1, 00, 042 మంది పురుష ఓటర్లు, 1, 00, 856 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 13 మంది ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో 1, 16, 541 మంది పురుష ఓటర్లు, 1, 17, 612 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 19 మంది ఉన్నారు. కదిరి నియోజకవర్గంలో 1, 21, 339 మంది పురుష ఓటర్లు, 1, 22, 536 మంది మహిళా ఓటర్లు, థర్డ్ జెండర్లు 10 మంది ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మైనుద్దీన్, కలెక్టరేట్ తహసీల్దార్ శ్రీనివాసులు, ఐటీ సపోర్టర్ కల్పన, పుట్టపర్తి ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ నరసింహులు, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్లు రామకృష్ణారెడ్డి, అశ్వర్థనారాయణ, శ్రీనివాస రెడ్డి, కదిరి ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.