సంతమాగులూరు మండలంలోని ఎమ్మెల్యే రవికుమార్ క్యాంప్ కార్యాలయం నందు సంతమాగులూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి వాల్ పోస్టర్ ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గాడిపర్తి వెంకట్రావు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ మూడున్నర ఏళ్ల పాలనలో ప్రజలు విసిగెత్తిపోయారని అన్నారు. ఒకవైపు పెన్షన్ల , సంక్షేమ పథకాలలో కోత, మరొకవైపు జీవనోపాధి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రజలపై భారాలను మోపి ప్రశ్నించే వారి గొంతులు నొక్కుతున్నారని వెంకట్రావు విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa