భార్యపై అనుమానంతో దారుణానికి ఒడిగట్టాడో భర్త. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన రేణుక బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుండేది. కొన్నాళ్లుగా భర్త మహ్మద్ అన్సారుల్, అనుమానంతో రేణుకని వేధించేవాడు. ఈక్రమంలో ఓరోజు రేణుకతో గొడవ పడి,కోపంలో ఆమెను నరికేశాడు. అనంతరం మృతదేహాన్ని 2 ముక్కలు చేసి కెనాల్‌లో పడేశాడు. వారం రోజులుగా రేణుక కనపించట్లేదంటూ ఆమె కుటుంబీకులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa