జాతీయ జట్టుకు ఆడాలన్న రాహుల్ త్రిపాఠి కల నిజమైంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో అతను ఆరంగ్రేటం చేశాడు. మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నుంచి అతను డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కాగా టీ20 భారత జట్టుకు ఆడుతున్న 102వ ఆటగాడిగా రాహుల్ గుర్తింపు సాధించాడు. రాహుల్ గతేడాదే టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైనా, బెంచ్‌కే పరిమితమయ్యాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa