కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీలో అప్పులు భారీగా పెరిగిపోయాయని. చెల్లింతే పరిస్థితి లేదని పేర్కొన్నారు. నాబార్డ్, విదేశీ రుణాలు, ఎస్పీవీ సంస్థల ద్వారా తీసుకున్న రుణాలు రూ.9.03 లక్షల కోట్లకు చేరిందని, ఇది జీడీపీలో 75శాతమని అన్నారు. పరిమితిమి మించి అప్పులు చేసినందున, వాటిని సర్దుబాటు చేసేవరకు కొత్త అప్పులు ఇవ్వొద్దని కోరారు.