శబరిమల నుంచి ఓ పావురం 800 కి.మీ ప్రయాణించి తన యజమాని ఇంటికి తిరిగి చేరుకుంది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లా మేగలహట్టికి చెందిన వెంకటేశ్ పావురాలు పెంచుకుంటున్నాడు. అయ్యప్ప మాల ధరించిన అతను శబరిమల దర్శనానికి వెళ్లాడు. తనతో ఓ పావురాన్ని తీసుకెళ్లిన అతను పక్షి జ్ఞాపకశక్తి తెలుసుకునేందుకు డిసెంబర్ 30న అక్కడే వదిలేయగా తిరిగి క్షేమంగా ఇంటికి చేరింది.