పాక్ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పై (టీఆర్ఎఫ్) కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో దాన్ని ఉగ్రవాద సంస్థగా కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలు జాతీయ భద్రత, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. 2019లో టీఆర్ఎఫ్ ఉనికిలోకి వచ్చింది.