పుణేలో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20లో శ్రీలంక భారత్ ను ఓడించి సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో భారత టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. నో బాల్ వేయడం నేరం అని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. పవర్ ప్లే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ పేలవంగా ఆడినట్లు పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో బౌలర్లు ఏకంగా 7 నోబాల్స్ వేయడం సహా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa