మహిళలకు ఉపాధి, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో చెన్నై నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు అవతార్ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ సౌందర్య రాజేష్ తెలిపారు. దేశంలోని పలు నగరాలను రెండు కేటగిరీలుగా గుర్తించి వేర్వేరుగా సర్వే నిర్వహించినట్లు వివరించారు. తర్వాతి స్థానాల్లో పుణే, బెంగుళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, విశాఖ, కోల్ కతా, కోయంబత్తూర్, మధురై ఉన్నాయని పేర్కొన్నారు.