ఇటీవల పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి న్యూజల్పాయిగురి మధ్య వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగివ విషయం తెలిసిందే. మాల్దా జిల్లాలో కొందరు దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనకు పాల్పడ్డవారు రైలుకు అమర్చిన సీసీ కెమెరాకు దొరికారు. రైల్వే ట్రాక్ పక్కన నిల్చున్న నలుగురు వ్యక్తులు సీసీ ఫుటేజీలో రికార్డయ్యారు. వారిని గుర్తించేందుకు అధికారులు యత్నిస్తున్నారు.