స్కూలు పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటన పల్నాడు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూలు బస్సు 30 మంది పిల్లలను స్కూలుకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు అదుపుతప్పి ఒకవైపు బోల్తాపడి ఆగిపోయింది. దీంతో 30 మంది విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa