ఢిల్లీ మేయర్ ఎన్నికపై రసాభాస నెలకొంది. నామినేటెడ్ కౌన్సిలర్లు ప్రమాణం చేసే సమయంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపునిచ్చారు. ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించగా.. షెల్లీ ఒబెరాయ్ మేయర్ పీఠానికి పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. ఆప్ బ్యాకప్ అభ్యర్థిగా అషుథాకూర్ ను నిలబెట్టనుంది.