ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవోలో రోడ్డు షోలు, సభలను బహిష్కరించినట్టుగా ఉందా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 03:59 PM

‘చంద్రబాబు ఎక్కడ కాలుపెడితే అక్కడ జనం పిట్టల్లా రాలిపోతుంటే.. బాధ్యత కలిగిన ప్రభుత్వం చూస్తూ ఉరుకుంటుందా..? ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకే జీవో నం.1 తీసుకొచ్చాం, ప్రజలు, వారి ప్రాణాలే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో రోడ్డుషోలు, సభలను బహిష్కరించినట్టుగా ఉందా..? లేక చంద్రబాబును, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ను కట్టడి చేసినట్టుగా ఉందా..? ఒక్కసారి ఆ జీవోను చదుకోవాలని సూచించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తోందని చెప్పారు. జీవోను అతిక్రమిస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com