కర్ణాటక అసెంబ్లీ విధాన సభ గేట్ వద్ద భారీ మొత్తంలో నగదును పోలీసులు పట్టుకున్నారు. జూనియర్ ఇంజినీర్ జగదీశ్ బ్యాగులో రూ.10 లక్షలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసుతో సంబంధం ఉన్న అందరినీ శిక్షిస్తామన్నారు.